29-11-2025 12:04:44 AM
నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినంధించిన జిలా ఎస్పీ
కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): నిర్లక్ష్యంగా కారు నడుపుతూ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొని మృతికి కారకులైన వ్యక్తికి శుక్రవారం బిచ్కుంద న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండే బల్లుర్ గ్రామానికి చెందిన కుమ్మరికుంట నాగయ్య (70) 14 ఆగస్టు 2017న కండెబల్లూర్ గ్రామం నుండి జుక్కల్ గ్రామం కు నడుచుకుంటూ వెల్లుచుండగా, అదే సమయమున నింధితుడు మహమ్మద్ షామిమ్ కారు నెంబర్ AP-10-AT-4574 (తెల్ల కలర్ టాటా ఇండిగో మాంజ) గల ధానిని అతివేగముగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వెంకట్ గౌడ్ హోటల్ వద్ద వెనక నుండి వచ్చి ఢీకొట్టడంతో కుమ్మరి నాగయ్య గాయపడ్డారు.
వెంటనే అతనిని చికిత్స నిమిత్తము బాన్స్ వాడ హాస్పిటల్ కు తరలించగా, ఆసుపత్రిలో డ్యూటిలో వున్న డాక్టర్ పరీక్ష చేసి మరణించి నట్లు ధ్రువీకరించారు. నిందితుడు తన కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపి నాగయ్య మరణానికి కారణమైనాడు, కావున అతని పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అప్పటి జుక్కల్ ఎస్త్స్ర కి మృతుని కుమారుడు కుమ్మరి కుంట పరమేష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కేసు విచారణంలో బాగంగా సాక్షులను విచారించి, చుట్టుప్రక్కల వారిని విచారించి సరియగు సాక్ష్యాలను సేకరించి నిందితుడు అయిన మహమ్మద్ షామిమ్‌ను అరెస్ట్ చేసి తదుపరి కోర్టుయందు అభియోగపత్రం వేశారు. ఈ కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించి బిచ్కుంద జుడీష్యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె. వినీల్ కుమార్ నింధితుడికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేసిన అప్పటి జుక్కల్ ఎస్త్స్ర ఏ. రవికుమార్, పోలీసు తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజేశ్ గౌడ్ , కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత జుక్కల్ SHO కె. నవీన్ చంద్ర, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ జె. రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ జి. సాయిలును జిల్లా ఎస్పీ అభినందించారు.