calender_icon.png 16 May, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు సరస్వతి నది పుష్కరాలు

16-05-2025 08:33:55 AM

హైదరాబాద్: తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు (Saraswati River Pushkaralu) కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో నిన్న 80 వేల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పుణ్యస్నానం ఆచరించనున్నారు.

కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్‌ సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.