calender_icon.png 28 September, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఇద్దరి ఫొటోలూ పక్కపక్కనే అతికించేదాన్ని

28-09-2025 01:35:47 AM

శివానీ నాగరం  సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్’ చిత్రంతో పరిచయమైంది. తొలి సినిమానే మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మౌళి హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత శివాని క్రేజ్ మరింత పెరిగింది. దీంతో నెట్టింట ఈ అమ్మడు ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూ సందడి చేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పిందీ యంగ్ బ్యూటీ. ముఖ్యంగా తన అభిమాన హీరో గురించి శివానీ చెప్పిన ముచ్చట్లు ముచ్చటగొలిపేలా ఉన్నాయి.

“నాకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన ఫోటోలు న్యూస్ పేపర్‌లో వస్తే వాటిని కట్ చేసి దాచుకునేదాన్ని. ఆ ఫోటోలన్నీ ఓ బుక్‌లో అతికించుకునేదాన్ని. ఆయన ఫోటోలను నా ఫోటోల పక్కన అతికించేదాన్ని. మా అమ్మ అవి చూసి ఏంటని అడిగితే ఆర్ట్‌అండ్‌క్రాఫ్ట్ క్లాస్ వర్క్ అని చెప్పేదాన్ని. అంతేకాదు మహేశ్‌బాబు పేరు కింద శివాని నాగరం అని రాసి ఫ్లేమ్స్ వేసేదాన్ని. ‘లవ్’ కానీ, ‘మ్యారేజ్’ కానీ రావాలని నా పేరులో కొన్ని అక్షరాలు యాడ్ చేసేదాన్ని” అంటూ సిగ్గుపడుతూ చెప్పింది శివానీ. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.