16-10-2025 05:38:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పోషక అభియాన్ కార్యక్రమం ఆకట్టుకుంది. మహిళలు వివిధ రకాల పోషక విలువలు గల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రదర్శనలో ఏర్పాటుచేసి వాటిలో ఉండే విటమిన్లు ఆరోగ్య సంరక్షణకు ప్రయోజనాలను వివరించారు. ఈ స్టాళ్లను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించి గర్భిణీలకు పోషకాహారం అందించి వారికి కుంకుమ పెట్టి ఆశీర్వాదం ఇచ్చారు. తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.