23-04-2025 12:44:21 AM
కృష్ణ ఏప్రిల్ 22: మండలంలోని గుడెబల్లూర్, ముడుమాల్ , కున్సి, ఆలంపల్లి, తం గిడి తదితర గ్రామాల్లో మంగళవారం అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాస సంబరాలు ఘనంగా నిర్వహించారు ఇట్టి పోషణ మాస సంబరాలకు ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ హాజరై మాట్లాడుతూ మిల్లెట్స్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్త నా లు, స్థానికంగా దొరికే ఆకుకూరలు, కూరగాయల్లో పోషణ విలువలు ఎక్కువగా ఉంటా యని, ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చే సుకోవాలని తాజా కూరగాయలు ఆకుకూర లు పండ్లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమల, సునిత, కవిత ఆయా లు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు