13 April, 2026 | 12:12 AM

శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణం

01-05-2024 12:45 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30, విజయక్రాంతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావు కుటుంబ సభ్యులు, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వీరిద్దరూ 2022 జూలైలో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచురణతో వారిద్దరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.