calender_icon.png 12 January, 2026 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడిత వర్గాల పోరాట యోధుడు ఓబన్న

12-01-2026 12:47:58 AM

మెదక్, జనవరి 11(విజయక్రాంతి): పీడిత వర్గాల పోరాట యోధుడు ఒడ్డె ఓభన్న అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. ఓబన్న జయంతిని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పీడిత ప్రజలు ఆరాధ్య దైవం, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు వొడ్డె వొబన్న అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. ఓభన్న సామాజిక సమానత్వం, శ్రమ విలువలు, ఐక్యతకు ప్రతీకగా నిలిచారని తెలిపారు.

సమాజంలోని పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన ఆదర్శాలను అనుసరించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.  వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వడ్డెర సంఘం నాయకులు నూతన సంవత్సరం పురస్కరించుకొని బొకేలు, శాలువాలు లేకుండా విద్యార్థులకు ఉపయోగపడే దుప్పట్లు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా వడ్డెర సంఘం నాయకులను కలెక్టర్ అభినందించారు. ఓబన్న విగ్రహానికి స్థలం కేటాయించాలని వడ్డెర సంఘం నాయకులు కలెక్టర్ ను కోరగా సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించాలని అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ నగేష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ గౌడ్. జిల్లా సహాయ బిసి సంక్షేమ శాఖ అధికారి  వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గ సాయిలు జిల్లా గౌరవ అధ్యక్షులు పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఉపాధ్యక్షులు ఎల్లయ్య నాయకులు, సంపంగి, వల్లెపు శ్రీను,బిక్షపతి, నర్సింలు, మధు, ఎల్లం, శ్రీశైలం, వెంకట్, సంతోష్, అశోక్ రమేష్ పాపయ్య, వెంకట్, మహేష్, రాజు సంబంధిత అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు, వొడ్డె సంఘ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.