calender_icon.png 4 January, 2026 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ జాబితాపై అభ్యంతరాలను తెలియజేయాలి

03-01-2026 12:00:00 AM

పెద్దపల్లి, జనవరి- 2(విజయక్రాంతి): పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా పై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు (పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్) 1 మున్సిపల్ కార్పొరేషన్ (రామగుండం) కలిపి మొత్తం 124 వార్డులలో 2 లక్షల 58 వేల 59 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు సరైన వార్డులో ఉందా లేదా చెక్ చేసుకోవాలని లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. 

జనవరి 10న పట్టణ ప్రాంతాలకు సంబంధించి  ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ జాబితా తయారీపై జనవరి 5న మున్సిపల్ కార్యాలయాల్లో, జనవరి 6న కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లి, జనవరి -2 (విజయక్రాంతి): గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ,జనవరి 21, 2026 గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల  బాలికల బాలుర పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి & 6 నుంచి 9వ  తరగతులలో ఖాళీ సీట్లలో ప్రవేశం కొరకు  (ఇంగ్లీష్ మీడియం) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని  తెలిపారు. ఆసక్తి గలవారు జనవరి 21 ,2026  లోపు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్, ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని, వివరాలకు https://tgcet.cgg.gov.in ను కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.