calender_icon.png 24 October, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి పంటల పరిశీలన

22-10-2025 05:28:02 PM

వెంకటాపురం/నూగూరు (విజయక్రాంతి): వరి రకము ఎంటియు 1001లో సమస్యలు ఉన్నాయని కొంతమంది రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు మేరకు బుధవారం మండల వ్యవసాయ అధికారి నవీన్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు కలిసి వెంకటాపురం మండలం బెస్త గూడెం, నూగూరు గ్రామాల్లో వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులు దగ్గర నుండి వారు వాడిన ఎరువులు, పురుగు మందులు మొదలైన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. దీనిపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను త్వరలోనే అందిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్,శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ విజయ్ భాస్కర్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అండ్ హెడ్.డాక్టర్ రాజకుమార్, డాక్టర్ సౌందర్య, కుమారస్వామి టీజీ సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్, ఏఈఓ శ్యాం కుమార్ రైతులు పాల్గొన్నారు.