22-10-2025 05:24:23 PM
ములకలపల్లి (విజయక్రాంతి): ఆదివాసుల ఆరాద్యుడు, గోండు బేబ్బులి, ఆదివాసీ జాతి నాయకుడు స్వర్గీయ కొమరం భీమ్ జయంతిని బుధవారం మండలంలోని తిమ్మంపేట గ్రామంలో నిర్వహించారు. తిమ్మంపేట గ్రామపంచాయతీలోని ఆదివాసీ యువత ఆధ్వర్యంలో ఆదివాసి జాతిజెండాను ఎగరావేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసీల కోసం ఆయన చేసిన ఉద్యమాన్ని, సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల యువత, పెద్దలు పాల్గొన్నారు.