calender_icon.png 29 August, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు 100 గజాల స్థలం ఇవ్వాలి

29-08-2025 03:23:02 AM

కలెక్టరేట్ వద్ద ధర్నా

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయ క్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సొంత ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం 100 గజాల స్థలం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసిం ది. గతంలో పట్టాలు పొందిన వారికి వెంట నే స్థలాలు కేటాయించాలని కోరుతూ సం ఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వేలాది మంది పేదలు నివాసం లేక అద్దె ఇళ్లలో దుర్భర జీవితం గడుపుతున్నారని, వారికి ఇళ్లు లేని బాధ వర్ణనాతీతమని బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.

దశాబ్దాల పోరాటం ఇంకా అందని ఫలాలు 1990 నుంచి 2004 మధ్య ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితంగా తట్టి అన్నారం, సూరారం, న్యూ హఫీజ్పేట్, హ యత్నగర్ వంటి అనేక ప్రాంతాల్లో వేలాది మందికి ఇళ్ల పట్టాలు లభించాయని, వారం తా ప్రస్తుతం సొంత ఇళ్లలో హాయిగా జీవిస్తున్నారని నాయకులు గుర్తు చేశారు.

అయి తే, 2002- మధ్య బీసీ సంక్షేమ సం ఘం, గుడిసె వాసుల సంఘం కలిసి ఉప్పల్ మండలం జైపూర్ కాలనీ, నాగోల్ వద్ద పత్తులగూడ గ్రామంలో దాదాపు 2,000 మంది పేదల కోసం పోరాడగా, నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి 1,500 మంది అర్హులైన వారికి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఈ పట్టాలను ఘట్కేసర్ మండ లం కాచువాని సింగారం గ్రామంలోని సర్వే నెం. 66లో ఉన్న ప్రభుత్వ స్థలంలో కేటాయించినప్పటికీ, నేటికీ వారికి స్థలం అప్పగించలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇందిరమ్మ ఇళ్లు ఏవీ?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా మని గొప్పలు చెప్పుకుంటున్నా ఇప్పటివరకు ఎవరికీ ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని నేతలు విమర్శించారు. 

ప్రభుత్వ భూములు అమ్మరాదు

ఇల్లు లేని పేదలకు స్థలాలను కేటాయించకుండా, ప్రభుత్వ స్థలాలను వేలం వేసి వందల కోట్లకు అమ్మడం అన్యాయమని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ భూ ములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని, వాటిని ఇల్లు లేని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో భాకీ రవి, ములుగు నవీన్, భాకీ సోమయ్య, ఉప్పలయ్య, వెంకన్న, అయ్యన్న, ముర్తయ్య తదితరులు పాల్గొన్నారు.