calender_icon.png 8 October, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన అధికారులు

08-10-2025 12:37:37 AM

  1. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేటు వ్యక్తి
  2. కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో దాడులు

కరీంనగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెడికల్ షాపుల రిన్యువల్ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటున్నారన్న సమాచారంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్తిక్‌ను, వారితో ఉన్న రాము అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.