08-10-2025 12:37:27 AM
జిల్లా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్
చేగుంట, అక్టోబర్ 7 :చేగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ మంగళవా రం సందర్శించారు. అనంతరం కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణీలకు సాధారణ ప్రసవంపై అవ గాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధి కారి అనిల్ కుమార్, అనిసోద్దిన్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఏఎన్‌ఎంలు జ్యోతి, భాగ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.