calender_icon.png 22 January, 2026 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారికంగా బతుకమ్మ వేడుకలు

02-10-2024 01:59:36 AM

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం  బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మంగళవారం ప్రారంభమయ్యే వేడుకలు 10వ తేదీ వరకు నగరంలోని రవీంద్ర భారతిలో సాగుతాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఒక్కొక్క పువ్వేసి చందమామ పుస్తకావిష్కరణ, 3న అటుకుల బతుకమ్మ , 4న ముద్దపప్పు బతుకమ్మ, 5న నానబియ్యం బతుకమ్మ, 6న అట్ల బతుకమ్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర నీరాజనం, 7న అలిగిన బతుకమ్మ, 8న వేపకాయల బతుకమ్మ,  9న వెన్నె ముద్దల బతుకమ్మ, 10న సద్దుల బతుకమ్మ వేడుకలు జరగుతాయి.