03-01-2026 08:13:38 PM
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్‌లో ఉన్న శ్రీ రామాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన విశేష పూజలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు యాసకుమార్ తదితరులు ఎమ్మెల్యేకి సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రాహుల్ దాస్ బాబా స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశ్శీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ రాహుల్ దాస్ బాబా మాట్లాడుతూ... ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, మరింత సేవాభావం కలగాలని, భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని, వారి నాయకత్వంలో మహబూబ్‌నగర్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయగల శక్తి లభించాలని ఆకాంక్షిస్తూ, తన జన్మదినాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానన్నారు.