calender_icon.png 20 September, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాదులుగా పైళ్ల లింగారెడ్డి, బొల్లెపల్లి కుమారులు

20-09-2025 12:34:30 AM

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాదులుగా సీనియర్ అడ్వకేట్  ఫైళ్ళ లింగారెడ్డి,  న్యాయవాది బొల్లెపల్లి కుమారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశపు మందిరంలో  అడ్వకేట్లు వారికి శాలువలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పైళ్ళ లింగారెడ్డి, కుమారులు మాట్లాడుతూ తమను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించడానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,  ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,  మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గార్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు  తెలిపారు.

ప్రభుత్వానికి, ప్రజలకు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి.వి గౌడ్, అడిషనల్ పిపి వంచ దామోదర్ రెడ్డి, న్యాయవాదులు ఎం. రాజిరెడ్డి, నక్కల మల్లేశం, నరసింహ యాదవ్, బబ్బురి హరినాథ్, కేశవరెడ్డి, విద్యాసాగర్, జంగారెడ్డి, రాంమ్ రెడ్డి, జిట్ట భాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు రేణుక, కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సిహెచ్. ఐలయ్య, బొమ్మ వెంకటేష్, కుక్కదువ్వు కృష్ణ, బొడ్డు కిషన్ పాల్గొన్నారు.