calender_icon.png 16 July, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అంకితభావంతో పనిచేయాలి

16-07-2025 12:39:55 AM

- 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని అసెంబ్లీలో తీర్మానం

- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

కామారెడ్డి, జూలై 15 (విజయ క్రాంతి) కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి (సీతక్క) అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ధి సంక్షే మ పథకాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఉమ్మడి జిల్లా ఇన్చా ర్జి మంత్రిగా హాజరైన మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూఅధికారులు అంకితభావంతో పనిచేస్తే అ ద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.

జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ముం దుగా మై నారిటీ రెసిడెన్షియల్ బాలికల పా ఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రి అనసూయ పోలీసుల గౌరవ వందనం స్వీ కరించారు. తదనంతరం అధికారులతో స మీక్ష నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో, మాన వతా దృక్పథంతో పని చేయాల ని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం లో ముందుండాలని స్పష్టం చేశారు.

ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. బాగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని సూ చించారు.వారానికి ఒకటి, రెండు సార్లు ఉన్నతాధికారుల తో సహా అధికారులు ఫీల్ విజిట్ చేయాలని మంత్రి సూచించారు. అలా జరిగితేనే క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారులకు తెలుస్తాయన్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కార మార్గం కూడా ఉంటుంద ని, సమస్య జఠిలం అయ్యేదాక చూసుకోవద్దని అధికారులకు హితవు పలికారు. సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల తల్లిదండ్రులు, అధికారుల పిల్లలు తలెత్తుకునేలా పని చేయాలని సూచించారు. నిర్రక్షం గా వ్యవహరిస్తే సహించ బోమని హెచ్చరిం చారు.

ఇందిరమ్మ ఇండ్లు పనులు త్వరగా పూర్తయ్యల చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పనులు చేపట్టి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ గా వ్యవహరిస్తూ అధికా రులు పనిచేయాలన్నారు. ఈ సమావేశం లో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సీ తారామచంద్రన్ ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభు త్వ వ్యవ సాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా ఎస్పీ రాజేష్ చం ద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రా వు, జుక్క ల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మ ద్ది చంద్రకాం త్ రెడ్డి, పలు సమస్యలను ఎ మ్మెల్యేలు మం త్రి దృష్టికి తెచ్చారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారులపై చర్య లు తీసుకోవాలని ఇందిరమ్మ పథకం పను లు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని తెలిపా రు.జిల్లా అటవీశాఖ అధికారి భోగ నికిత, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా లోని వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.