06-08-2025 12:00:00 AM
ప్రోహిబిటెడ్ భూముల విక్రయాలకు బల్దియా అధికారుల వెన్నుదన్ను..?
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5 (విజయ క్రాంతి):జిల్లా కేంద్రంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని జంట పట్టణాలుగా పేరొందిన పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతా ల్లో అక్రమాలకు మున్సిపల్ కార్పొరేషన్ అ ధికారుల అండదండలు దండిగా ఉన్నాయ నే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. తగి న ఆధారాలతో పత్రికల్లో శీర్షికలు వెలువడినా చర్యలు తీసుకోకపోవడం ఆరోపణల ను ధ్రువపరుస్తోంది.
పారిశ్రామిక ప్రాంతమై న పాల్వంచలో మే నెలలోలేని ఇండ్లకు ఇం టి నెంబర్లు, అడిగినంత ఇచ్చుకో ఇంటి నెం బర్ పుచ్చుకో అనే శీర్షికలు విజయ క్రాంతి దినపత్రికలో ఆధారాలతో బహిర్గతం చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు లేకపో వడం గమనారహం.
లేని ఇండ్లకు, ఇంటి నెంబర్లు కేటాయించినందుకు మున్సిపల్ కా ర్యాలయం అధికారులకు రూ లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. 22_3_142/16/A/1, 22_ 3_142/18, 22_3_142/17/A/1 నెంబర్లను కాళీ ప్రదేశాలకు పొంది ఉన్నారు. సుమారు 1500 గజా ల స్థలంలో ఇట్టి నెంబర్లను అధికారులకు అడిగినంత ఇచ్చి పట్టణానికి చెందిన ఓ ప్ర ముఖ వ్యాపారి పొందినట్లు తెలుస్తోంది.
వా స్తవానికి ఆ ప్రాంతం 817 సర్వే నంబర్లు ఉంది. ఆ నెంబర్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చే యరాదని అప్పటి కలెక్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఆ వ్యా పారి ఆ స్థలాన్ని విక్రయించేందుకు మున్సిపల్ అధికారులకు అడిగినంత ఇచ్చి కాళీ ప్ర దేశంలో ఇంటి నెంబర్లు పొంది దర్జాగా విక్రయించారు. ఆ స్థలాన్ని రూ 4 కోట్లకు విక్ర యించినట్లు విశ్వాసనీయ సమాచారం. అక్ర మ రిజిస్ట్రేషన్ లకు మున్సిపల్ అధికారుల అండదండలు అనే ఆరోపణను రుజువు చే స్తోంది. వీటిలో 22 _3_142/18 నెంబర్ను 2012 _13 సంవత్సరంలో పొందినట్లు ము న్సిపల్ అధికారులు తెలుపుతున్నారు.
మిగిలిన రెండు నెంబర్లను 2021 మార్చి నెలలో పొందినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇండ్లు లేని ఇంటి నెంబర్లను రద్దు చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంత ర్యం ఏమిటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుం ది. పాల్వంచ పట్టణంలో ఇవి ఒక మచ్చుతునకలు మాత్రమే.
ఇంకా పట్టణంలోని నిషేధి త ప్రాంతాల్లో ఇంటి నెంబర్లు పొంది ప్రభు త్వ, ఎస్త్స్రన్మెంట్ భూములను దర్జాగా విక్రయిస్తున్న ఆటురెవెన్యూ అధికారులు, ఇట్టు మున్సిపల్ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించటం అక్రమాలకు అండదండలు ఆరోపణలకు బలం చేకోరుస్తుందని తె లుస్తోంది. ఇది అప్పటి మున్సి పాలిటీ, ప్రస్తు త కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల రెవెన్యూ విభాగపు అధికారుల తీరు.
ఆక్రమించు కో.. నిర్మించుకో..
కాలీజాగా వేసవి బాగా అన్నట్లు ఉంది పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాల్లో ము న్సిపల్ కార్పొరేషన్ కాలీ స్థలాల తీరు. పట్ట ణ ప్రణాళిక విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా జంట పట్టణాలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములు, మున్సిపల్ కాలేజ్ స్థలాలు, డ్రై నేజీలను సైతం అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఈ పట్టణాల్లో జి ప్లస్ టు నిర్మాణం వరకే ప ర్మిషన్ ఉంటుంది.
ఇబ్బడి మొబ్బడిగా బ హుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సా గుతున్నాయి. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాల్వంచ పట్టణ పరిధిలో కాంట్రాక్ట్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా జి ప్లస్ టు భవనం నిర్మాణం చేస్తున్న, మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వెనుక భాగంలో ఏకంగా మున్సిపల్ డ్రైనేజీ పైనే షెడ్డు ని ర్మాణం జరిగిన, చాకలి బజారులో తీసుకు న్న అనుమతులకు మించి మున్సిపల్ స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేస్తున్న అధికారులకు సోయలేకపోవడం శోచనీ యం.
అక్రమ నిర్మాణాలు అధికారులకు కా సుల వర్షం కురిపిస్తుంది అనటంలో ఎ లాంటి సందేహం లేదు. ఇప్పటికైనా రెవె న్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు జంట పట్టణాలలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను, ఇండ్లు లేని ఇంటి నెంబర్ల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంట పట్టణాల ప్రజలు కోరుతున్నారు.