09-07-2025 10:34:11 PM
ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బి.బాబు..
సూర్యాపేట (విజయక్రాంతి): 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు ప్రభుత్వం ఇచ్చిన సాగు లక్ష్యం 3000 ఎకరాలు అని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులను సమానవ్యం చేసుకొని ఈ సంవత్సరం లక్ష్యంను జూలై 31 లోపు పూర్తిచేయాలని ఉద్యాన శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ బి.బాబు(State Joint Director of Horticulture Department B. Babu) అన్నారు. బుధవారం జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో అధికారులు, పతంజలి ఆయిల్ ఫామ్, డ్రిప్ కంపెనీ సిబ్బందితో ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఆయిల్ ఫామ్ తోటల సాగుతో రైతులు ప్రతి నెల అధిక ఆదాయం పొందే అవకాశం ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతులకు వివరించి నీటి వసతి ఉన్న రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేసుకునేలా చూడాలని సూచించారు.
మనదేశంలో పామాయిల్ దాదాపు 70 కోట్ల విలువగల ఆయిల్ దిగుమతి చేసుకుంటుందనీ, దిగుమతినీ తగ్గించాలి మన రైతులు ఆయిల్ పామ్ తోటలను పెద్ద ఎత్తున సాగు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్ ఎం ఈ ఓ పి పథకం ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఉంటుంది కావున రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ తో నూనె, వాటి యొక్క ఉత్పత్తులతో కేక్, ఫైబర్, జీవన ఇందనం, బయో డీజిల్ గా వాడుతున్నారని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకునే రైతులు సంబంధిత ఉద్యాన, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారులు, మహేష్, ప్రమిత, ఆయిల్ ఫామ్ కంపెనీ జనరల్ మేనేజర్ బి యాదగిరి, మేనేజర్ జె హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.