09-07-2025 10:37:07 PM
పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు..
జాతీయ మానవ హక్కుల సంఘం శంకరాజుపల్లి అధ్యక్షుడు కొండగొర్ల శ్రీకాంత్..
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని(ఎన్.హెచ్.ఆర్.సీ) జాతీయ మానవ హక్కుల సంఘం శంకరాజుపల్లి అధ్యక్షుడు కొండగొర్ల శ్రీకాంత్ అన్నారు. అనంతరం జాతీయ మానవ హక్కుల సంఘం శంకరాజుపల్లి అధ్యక్షుడు కొండగొర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ... శంకరాజుపల్లి గ్రామంలో నిరుపయోగంగా చేతి పంపు ఉందని గతంలో ఎంతో మంది దాహార్తి తీర్చిన ఈ చేతి పంపు ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని చిన్న మరమ్మతులకు గురైనా రిపేరు చేయకపోవడంతో నెలల తరబడి వృథాగా తయారైందని అన్నారు.
నేతకాని కాలనీలో ఉన్న రోడ్డు
శంకరాజుపల్లి గ్రామ ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎక్కువగా నేతకాని కాలనీలో ఉన్న రోడ్డు నుంచే వెళతారన్నారు. ఈ రోడ్డు బురదమయమై వారు వ్యవసాయ పనులకు ఇతర చోట్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత గ్రామ ఉన్నతాధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోడ్డుపై బురద లేకుండా మొరం పోసి రహదారి బాగు చేయాలని అన్నారు.