calender_icon.png 10 July, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల కట్టలేనివి మాతృమూర్తి త్యాగాలు..

09-07-2025 10:24:58 PM

అల్లం రాజయ్య..

మందమర్రి (విజయక్రాంతి): అమ్మ భావన విశ్వజనీణ మైనదని అమ్మ త్యాగాలు వెల కట్టలేనివని విరసం సభ్యుదు, ప్రముఖ విప్లవ రచయిత అల్లం రాజయ్య అన్నారు. మండలంలోని మామిడి గట్టులో బుధవారం సదాశయ స్వచ్ఛంద సంస్థ(Sadashaya Voluntary Organization) ఆధ్వర్యంలో దేహదానం చేసిన మందల అమృతమ్మ సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  విప్లవోద్యమం విస్తరించిన తెలంగాణాలో అమృతమ్మ వంటి తల్లులు ఈ కాలంలో నిర్భంధాన్ని, భయాన్ని అనుభవిస్తూ త్యాగలు చేశారన్నారు.

ఇటువంటి విప్లవ మూర్థుల త్యాగాన్ని అర్ధం చేసుకోవడం తెలంగాణ సమాజం ముందున్న కర్తవ్యం అన్నారు. అమృతమ్మ తన కళ్ళను దానం చేసి ఇతరులకు చూపునిచ్చిందనీ, తన దేహాన్ని దానం చేసి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. బీజేపి క్రమశిక్షణా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గోనె శ్యాంసుందర్ రావు మాట్లాడుతూ... శ్యామ్ సుందర్ తన తల్లి నేత్రాలు  దానం చేయడం అభినందనీయం అన్నారు. ఈ సభలో సదాశ య ఫౌండషన్ జాతీయ కార్యదర్శి  లింగమూర్తి, రచయిత గురిజాల రవీందర్ రావు, మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు శాత్వాజీ, పౌర హక్కుల సంఘం నేత మాధాన కుమారస్వామి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.