calender_icon.png 16 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

15-07-2025 05:31:41 PM

మండల బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు గందే రాం చందర్

మందమర్రి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్ కోరారు. మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన ఆగిడి లక్ష్మికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60 వేల చెక్కును మంగళవారం ఆయన అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు.