calender_icon.png 18 September, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల నోట.. పోరాట గీతిక

15-09-2025 12:00:00 AM

“పల్లెటూరీ పిల్లగాడా !

పశులగాసే మొనగాడా !!

పాలు మరచీ ఎన్నాళ్లయ్యిందో..

ఓ పాల బుగ్గలా జీతగాడా..

కొలువు కుదిరీ ఎన్నాళ్లయిందో!

నీకు జీతము నెలకు కుంచము.. 

తాడి వడిపిలి కల్తి గాసము !

నీకు జీతము నెలకు కుంచము.. 

తాడి వడిపిలి కల్తి గాసము! 

కొలువ శేరు తక్కువ వచ్చాయా..” అంటూ వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు రాసిన గీతం 19వ శతాబ్దం తొలిరోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వేళ్లూనుకున్న బానిసత్వానికి, వెట్టిచాకిరీ వ్యవస్థకు నిదర్శనం. నాటి నైజాం పాలన ఈ ప్రాంత ప్రజలకు పీడ. నైజాం ప్రభువులకు తొత్తులుగా జాగీరార్లు, దేశ్‌ముఖ్‌లు ఇక్కడి ప్రజలపై సాగించిన హింసాకాండ చరిత్ర పుటలపై మాయ ని మచ్చ. తెలంగాణ సాయుధ పోరాటంపై స్పానిష్, రష్యన్, పోలీష్ కవులు కవితలు రాశారంటే నాటి ప్రజల తిరుగుబాటు ప్రపంచంపై ఎంతటి ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. రష్యన్ కవి విక్టర్ గోంచరోవ్ ‘లేవు.. కరకర పొడిచే పొద్దును ఆపే శక్తులు లేవు/లేవు.. లేవు.. ఉదయమాపు జైళ్లు’ అం టూ కవిత రాశాడు.

ఉర్దూ వాగ్గేయకారుడు మఖ్దూం మోహియుద్దీన్ నైజాం ప్రభుతను వ్యతిరేకిస్తూ ‘హవేలీ’ పేరుతో ఉర్దూలో కవి త రాయగా, ఆ కవితను తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్యులు ‘అది ఒక దెయ్యాల మేడ సమాజాల నీడ/ పీనుగలను పీక్కు తినే  రాబందుల రాచవాడ/ ఆద్యం తం అంతులేని  అరిష్టాల మహాపీడ’ అని అనువదించారు. నాడు ఆ కవిత ఒక సంచలనం. నైజాం ప్రభుత అణచివేతకు వ్యతి రేకంగా ప్రజలను ఏకం చేసేందుకు పుట్టిందే పాట. అదే తిరుగుబాటు బావుటా. ప్రజల ను ఏకత్రాటిపై తెచ్చేందుకు నాటి కవులు, కళాకారులు, గాయకులు అప్పటి కళారూపాలైన బుర్రకథలు, ఒగ్గు కథలు, గొల్లసు ద్దులను ఎంచుకున్నారు.  ‘ఒహో ఒహో పల్లెదొరా! ఒహో పాత దొరా! 

ఒంటరి తుంటరి తొండి దొరా!

ఎంతకూ మారని మొండి దొరా!’ అని సుద్దాల హనుమంతు హెచ్చరిక గీతం రాశా డు.‘గ్రామాధికారులు భీమ స్వరూపులై / పెక్కుటక్కుల వెతల్ బెట్టుచుండ/ వ్యాపార వర్గంబులా పూర్తి ధూర్తులై/ లాభంబు పూ ర్తి లాగుచుండ/ పాలకోద్యోగులు పట్టాభిషిక్తులై/ చిప్ప ముంతల పాలు సేయుచుండె’ అంటూ నాటి సామాజిక పరిస్థితులను పద్యకావ్యం లా ఎక్కుపెట్టాడు గంగుల శాయిరెడ్డి. ‘నైజాము సర్కారుగా, ఓరన్న/ నాజీ ల మించిందిరా/ ప్రజా రాజ్యానికై పోరాడు ప్రజలపై/ రాక్షస చర్యలను రకరాకల్ చేస్తుండే’ అని తిరునగరి రామాంజనేయులు గర్జించాడు. ‘ఓ నైజాము పిశాచమా, కానరాడు/ నిన్నుబోలిన రాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపి నావు/ నా తెలంగాణా, కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యులు పాటను ఎక్కుపెట్టాడు. ‘ఖబ డ్దార్ ! ఖబడ్దార్! నైజాం పాదుషాయే! బానిసత్వ విముక్తికై  రాక్షసత్వ నాశముకై/ హిం దూ ముస్లిం పీడిత శ్రమజీవులు ఏకమైరి’ అంటూ ఆవంత్స సోమసుందర్ హెచ్చరించాడు. 

నైజాము సర్కరోడా

నాజీల మించినోడా

యమబాధపెడ్తివి కొడుకో నైజాము సర్కరోడా ! 

పండిన పంటనంతా తిండికైనా ఉంచకుండా

తీసుకెళ్లినావు నైజాము సర్కరోడా!’ అంటూ యాదగిరి స్వయంగా గానం చేసి ప్రజలను ఏకం చేశాడు.

అమరుల స్మృతి గీతాలు..

రజాకార్ల దమనకాండకు బలైన అమరులపైనా స్మృ తి గీతాలు రాశారు. ‘జోహార్లు.. జోహార్లు.. జోహార్లు../ అమర వీరులారా మీకు జోహార్లు/ స్వాతంత్య్ర రథమునెక్కి  సమర వీధులందు తోలి/ అతివాద శరము ల గురిపి  అసువులపై నాస వదిలి.. సైసై రా  భళిసై/ స్వరక్త ధారలన్ గురిపి  స్వం తంత్ర బీజములనాటి/ వీర స్వర్గవాసులైన విప్లవయోధులకు నిత్య జోహార్లు’ అంటూ సుద్దాల హనుమంతు నిలువెల్లా పాటయ్యాడు.

శత్రువుల చేతికి చిక్కి అసువులు బాసిన పోరాట యోధుడు గోపాలరెడ్డిని ‘సై సై గోపాలరెడ్డీ, రెడ్డి, నీవు నిలిచావు ప్రాణాలొడ్డి/ ఔరారా నీ పేరు జెప్పితే/ హడలు దోపిడీ బడా దొరోళ్లకు’ అంటూ  తిరునగరి రామాంజనేయులు స్మృతి గీతంలో తలుచుకున్నాడు. ఇలా తెన్నేటి సూరి, కాళోజీ నారా యణరావు, టీవీ కృష్ణ, సుంకర సత్యనారాయణ, కోగంటి గోపాలకృష్ణయ్య, కొండేపూ డి లక్ష్మీనారాయణ, నారపరెడ్డి చంద్రారెడ్డి, గోపాలం, విద్వాన్ విశ్వం.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంకెందరో అజ్ఞాతక వులు కవులు సాయుధ పోరాటానికి ఊపిరిలూదారు. పోరాటంలో ప్రజలనే యోధు లుగా ముందుకు నడిపించారు.