18-09-2025 11:06:12 PM
కమిషనర్ తన్నీరు రమేష్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ రోడ్లపై పశువులను వదిలితే వాటిని గోశాలకు తరలిస్తామని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Commissioner Thanniru Ramesh) గురువారం హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో పశువులు సంచరిస్తున్నందున ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పశువులను గోశాలకు తరలిస్తామని చెప్పారు. మూడు రోజుల్లోగా రోడ్లపై వదిలేసిన పశువులను యజమానులు తీసుకెళ్లాలని సూచించారు.