18-09-2025 11:10:07 PM
మందమర్రి (విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇంటి మంజూరు కొరకు దరఖాస్తు చేసుకునేందుకు మండల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలి వద్దకి మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, ఆర్ఐ గణపతి రాథోడ్ లు స్వయంగా వచ్చి, ఆమె నుండి దరఖాస్తు తీసుకొని మానవత్వం చాటారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన మహిళకు ఇల్లు మంజూరుకు కృషి చేస్తానని, వికలాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆమెకు భరోసా కల్పించారు. వికలాంగురాలు ఆవేదనను అర్థం చేసుకొని, స్పందించిన తహశీల్దార్ పి సతీష్ కుమార్, ఆర్ఐ గణపతి రాథోడ్ లను పలువురు అభినందించారు.