calender_icon.png 19 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సేవాపక్షం అభియాన్​’ తో సమాజానికి మేలు

18-09-2025 10:57:27 PM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​

బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 

మన్సూరాబాద్ లో మెగా రక్తదానం శిబిరం 

ఎల్బీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును ‘సేవాపక్షం అభియాన్​’ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని మల్కాజ్​గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ ​నేత ఈటల రాజేందర్(MP Etela Rajender) ​అన్నారు. గురువారం రంగారెడ్డి అర్బన్ ​జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో మన్సూరాబాద్ లోని ​బీజేపీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రక్తదానం ప్రాణదానం, అందుకే ప్రతి యువకుడు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో చైతన్యం పెంపొందుతోందన్నారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సేవా పక్షం ద్వారా సమాజంలో బీజేపీ కార్యకర్తల సేవా భావం ప్రతిభింబిస్తోందన్నారు. మోడీ బర్త్​డేను సేవా దినోత్సవంలా జరపడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమన్నారు.  సమాజంలో అవసరమైనప్పుడు సేవ అందించడంలో బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండారి భాస్కర్,  బొల్గం  యశ్​పాల్​గౌడ్, కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి , మొద్దు లచ్చిరెడ్డి, రంగా నర్సింహగుప్తా, బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి, నాయికోటి పవన్ కుమార్, చింతల సురేందర్ యాదవ్, బీజేవైఎం నాయకులు అవినాష్ రెడ్డి, సిల్వేరి అనిల్, సీమ సోమనాథ్, సాయిరాం గౌడ్, రాకేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.