calender_icon.png 19 September, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవిక జీవన చిత్రణ రచనలు

15-09-2025 12:00:00 AM

‘కొత్త విషయాలు కొత్త పాఠకులకే కాదు. పాతవారికీ అవసరమే. నిజానికి పాఠకులు ఎప్పుడూ పాతబడరు. ఒకసారి సాహిత్యాన్ని చదవటం అలవాటైన వారు ఎంతో అనివార్యమైతే తప్ప పఠనం ఆపరు. అయితే.. ఒకప్పటి పాఠకులు కేవలం ప్రింటెడ్ బుక్స్ (హార్డ్‌కాపీ)నే చదివేవారు. నేటితరం వెబ్‌సైట్ల ప్రచురితమవుతున్న రచనలు, కవితల (సాఫ్ట్‌కాపీలు)నూ చదువుతున్నారు. పాఠకులు ఏ మాధ్యమంలో చదివినా కవులు, రచయితలు వారిని ఆకట్టుకునేలా, వారిని కదలించేలా రచనలు చేయడం ముఖ్యం’ అంటారు కవయిత్రి నెల్లుట్ల రమాదేవి. రెండు దశాబ్దాలకు పైగా ఆమె తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. అనేక కథలు, కవితల సంకలనాలను వెలువరించారు. 

కాలమిస్ట్‌గా, కార్టూనిస్టుగానూ ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె కృషిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 9న ప్రతిష్ఠాత్మక ‘కాళోజీ పురస్కారాన్ని అందజేసింది. ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్. ఆమెది సాధార ణ రైతు కుటుంబం. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్‌లో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. తర్వాత బ్యాంక్ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థాయికి ఎదిగినా సాహిత్యాన్ని మాత్రం ఆమె వదలలేదు. ఉద్యోగ బాధ్యతలు ఎంతగా ఉన్నా సాహిత్య ప్రక్రియ కొనసాగించారు.

తల్లి నుంచే సాహిత్యంపై మక్కువ..

రమాదేవి తల్లి మంచి పాఠకురాలు. ఆమె ను చూసి రమాదేవి సాహిత్యాభిలాష పెంచుకున్నారు. 1978లో ఆమె తొలి కథ ‘బుజ్జా యి’లో అచ్చయింది. జీవితంలో ఎక్కువ భా గం గ్రామీణ ప్రాంతంలో గడపడం వల్ల ఆమె రచనల్లో ఆ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.  ముఖ్యంగా స్త్రీల జీవనం, వారి విజయాలే ఆలంబన చేసుకుంటూ రచనలు చేశారు. ‘ఆడపిల్లులు చదు వుకుని విజ్ఞులు కావడం,  వారికి ఆస్తిపరమైన హక్కులు వచ్చాక వారు తల్లిదండ్రులను బాగా చూసుకోవడం కనిపిస్తున్నది. కానీ, కొందరు మహిళలు అత్తామామలను శత్రువులుగా చూస్తుండటం నాకు బాధ కలిగి స్తుంది’ అని రమాదేవి ఒక సందర్భంలో స్పష్టం చేశారంటే సమాజం పట్ల, వాస్తవికత ఆమెకు ఎంత స్పష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు.

రైతులు, మహిళల పక్షాన రచనలు..

‘వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి చేసే పని. అతివృష్టి, అనావృష్టి లాంటి బాధలు రైతులకు ఎప్పుడూ ఉంటాయి. ఇవి కాకుండా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులూ సైతం పీడి స్తూనే ఉంటాయి. ఏదో ఒకరోజు రైతులు పండించడం ఆపితే, ఇక పంటలు ఎవరు పండిస్తారు? జనం ఏం తింటారు’ అని ప్రశ్నిస్తారు రమాదేవి. రైతుల బాధల ఇతివృత్తంగాను ఆమె కథలు రాశా రు. అలా రాసిందే ‘ఆశల విత్తనం’ కథ. 

అలాగే ‘కాలం మారినా’ కథలో స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చర్చించారు. స్త్రీకి చదువు వల్ల ఆర్థిక స్వాత్రంత్య్రం రాదు. కేవలం ఉద్యోగం లేదా వృత్తి వల్లే వస్తుందని ఆమె నొక్కి చెప్తుంటారు. ఆమె కథల్లో మాతృత్వపు విలువ చెప్పే స్త్రీలు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు మోసపోయిన బాధితులు, బాధ్యతలేని భర్త నుంచి దూర మై కుటుంబాన్ని పోషించుకునే ఇల్లాలు, కట్నం కోసం వెంపర్లాడే వ్యక్తిని భర్తగా అంగీకరించక తిరస్కరించే ఆత్మాభిమానం ఉన్న విద్యావంతులైన యువతులు ఎక్కువగా కనిపిస్తారు.

తీవ్రమైన భావోద్వేగం కలిగినప్పుడు తాను కవిత్వం ద్వారా వ్యక్తపరుస్తానని చెప్తారు. కథకురాలిగా, కవయిత్రి గానే కాకుండా ఆమె కార్టూనిస్టుగాను రాణించారు. కథ, వ్యాసం, కవిత్వం ద్వారా వ్యక్తీకరించే అంశాలను చిన్న కార్టూన్ ద్వారానూ వివరించవచ్చంటారు రమాదేవి. ఆమె వేసిన కార్టూన్లు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. రమాదేవి 2301లో ‘మనసు భాష’ కవిత్వం, రమణీయం పేరిట కార్టూన్లు, ‘మనసు మనసుకూ మధ్య’ కథల సంకలనాలు వెలువరించారు. 2021 లో ‘చినుకులు’ పేరిట నానీల సంపుటి,- -2021లో ‘తల్లి వేరు’ పేరిట కథల సంకలనం, 2024లో ‘అశ్రువర్ణం’ పేరి ట కవితల సంపుటి ప్రచురించారు. 2023లో డి.కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్- వెలువరించారు. 2024లో ‘రమాయణం పేరిట కాలమ్స్ రాశారు.

అందుకున్న పురస్కారాలు..

రమాదేవి ఇప్పటివరకు ‘కవయిత్రి’ సంపుటికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం -(2004), కథ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013), కార్టూన్లకు అపురూప అవార్డు- (2014), తెలంగాణ ప్రభుత్వ జిల్లాస్థాయి ఉత్తమ రచయిత్రి పురస్కారం (2015), జాతీయ సాహిత్య పరిష త్తు, సిద్దిపేట ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం (-2015), గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు (2017), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం (201 7), గుఱ్ఱం జాషు వా ఫౌండేషన్ పురస్కారం (2018), వెంకటసుబ్బు స్మారక అవార్డు (2019), పర్చా రంగారావు స్మారక అవార్డు (2019), తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారం -(2021), కార్టూనిస్ట్ బాపు ణ అకాడమీ రాగతి పండరి స్మారక పురస్కా రం- (2021), ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కర్‌రావు స్మారక పురస్కారం (2023), ఎక్స్ రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం -(2024), డాక్టర్ రాణీ పులోమాదేవి స్మారక గౌరవ పురస్కారం- (2025), డాక్టర్ సినారె సాహిత్య పురస్కారం- (2025), యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘ పురస్కారం (20 25), రాష్ట్రప్రభుత్వ కాళోజీ పురస్కారం (2025) అందుకున్నారు.

ఎంతో ఆనందంగా ఉంది..

ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం ఆనందాన్నిచ్చింది. ఈ పురస్కారం నాకు దక్కిన గౌరవం కాకుండా ఓరుగల్లు కవులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నా. కాళోజీ నారాయణరావు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. ధీరోదాత్తమైన వ్యక్తిత్వం. ఆయనకు నిరాడంబరమే ఆభరణంగా ఉండేది. కాళోజీతో నాకు వ్యక్తిగతమైన పరిచయం ఉండటం ఒక సంతోషమైతే, అంతటి గొప్పవ్యక్తి పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా ప్రదానం చేసే పురస్కారం అందుకోవడం సంతోషాన్నిచ్చింది. అవార్డుకు ఎంపిక చేసిన కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రప్రభుత్వానికి నా కృతజ్ఞతలు 

 నెల్లుట్ల రమాదేవి, కాళోజీ పురస్కార గ్రహీత