18-09-2025 11:22:37 PM
ఆరోగ్య మహిళా, శక్తివంతమైన కుటుంబ అభియాన్ అవగాహన..
గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రతి మహిళ తమ జీవనశైలిని మార్చుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ బి నరేష్ కోరారు. మండలంలోని ఎల్బీనగర్ గ్రామంలో గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం అనే కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి మహిళ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవనశైలిని మార్చుకొని చిన్నపాటి వ్యాయామం, నడక, యోగ లాంటివి చేయాలని కోరారు. ఇంటిలో తయారు చేసుకునే ప్రతి ఆహారంలో ఉప్పు, నూనెల పరిమాణాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీకు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నాన్ కమ్యూనికపుల్ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ గ్రామంలో 42 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్ష నిర్వహించి అవసరమైన మందులను అందించడం జరిగిందని తెలిపారు. గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం చిన్న పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. చిన్నపిల్లలకు సంబంధించిన రుగ్మతలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, సూపర్వైజర్లు అంజయ్య గౌడ్, వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం లు కవిత, విజయ, ఆశ కార్యకర్తలు భవాని, వెంకటమ్మ, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.