calender_icon.png 19 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 నిముషాలు 180 సూర్య నమస్కారాలు

18-09-2025 11:01:49 PM

అంతర్జాతీయ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

మందమర్రి (విజయక్రాంతి): 60 నిమిషాల వ్యవధిలో 180 సూర్య నమస్కారాలు ప్రదర్శించి అంతర్జాతీయ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు పట్టణానికి చెందిన మద్ది శంకర్. పట్టణంలోని సింగరేణి హైస్కూల్ ఆవరణలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని, సూర్య నమస్కారాలపై శ్రద్ధాసక్తులు  ప్రదర్శించి గత కొంతకాలంగా సూర్య నమస్కారాల ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నారు. అంతర్జాతీయ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించే లక్ష్యంతో గురువారం 60 నిమిషాల వ్యవధిలో 180 ఆసనాలు ప్రదర్శించి యోగ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు ను సుస్థిరం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య నమస్కారాలు కేవలం శారీరక వ్యాయామమే కాకుండా ఆధ్యాత్మిక యాత్ర అని, ఆత్మ శుద్ధి, శక్తి ని ప్రసాదించే సాధన ఆని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను దినచర్యగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన మద్ది శంకర్ ను పలువురు అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల తహసిల్దార్  సతీష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు గోవర్ధనగిరి అనంతచార్యులు, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి కనపర్తి రమేష్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, యోగ గురువులు ముల్కల శంకర్, రెవెల్లి రాజలింగు, ఏఈఈజే పోచం, సింగరేణి కాంట్రాక్టర్ బర్ల సదానందం, మెడికల్ అధికారి డాక్టర్ అద్వైత, కార్యక్రమం కో ఆర్డి నేటర్లు షానవాజ్, గంప అనిల్, సింగరేణి యోగ క్లబ్ సభ్యులు, వాకర్స్ సభ్యులు, యోగ గురువులు పాల్గొన్నారు.