18-09-2025 11:12:36 PM
హనుమకొండ (విజయక్రాంతి): గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్(Collector Sneha Shabarish) అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు నిర్వహించే గోడ పత్రికను ఆవిష్కరించే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని సెంటర్ లోనే తినాలని, జిల్లా వ్యాప్తంగా పోషణ మాసం రోజు వారి ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహిచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జె. జయంతి, డిఆర్డిఓ. శ్రీను, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఇక్త తెధర్ అహ్మద్,డిఈఎంఓఅశోక్ రెడ్డి,హనుమకొండ ప్రాజెక్ట్ సిడిపిఓ విశ్వజ, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, మహిళా సాధికారత మిషన్ శక్తి కోఆర్డినేటర్ కళ్యాణి పాల్గొన్నారు.