calender_icon.png 31 December, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం

31-12-2025 12:00:00 AM

కాళేశ్వరం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పుర స్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఐదు గంటలకు ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామున నుంచే భ క్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనంతో పులకించిపోయారు. ఈ కా ర్యక్రమంలో మాజీ ధర్మకర్తలు, భక్తులు పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.

పోటెత్తిన భక్తులు 

మహబూబాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లాలో వివిధ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.

ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. వందల సంఖ్యలో భక్తులు దేవాలయాలకు తరలి రావడంతో పండగ వాతావరణం కనిపించింది.