17-09-2025 06:23:47 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద నకిరేకల్ పట్టణ కార్పెంటర్స్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకాన్ని అ యూనియన్ అధ్యక్షుడు దిగోజు వెంకటాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మలంతా ఒకతాటిపై ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ పట్టణ కార్పెంటర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దిగోజు వెంకటాచారి ఉపాధ్యక్షులు తాడోజు నాగార్జునచారి,కార్యదర్శి గడగోజు విశ్వజ్ఞచారి, కోశాధికారి పగిడోజు మహేంద్ర చారి, కార్యవర్గ సభ్యులు గడగోజు రవీంద్రచారి, కట్కోజు సైదాచారి, పుర ప్రముఖులు మోపూరి చంద్రమౌళి ,సిద్ధోజు భిక్షమాచారి, తాటికొండ లక్ష్మయ్య సంకోజు నారాయణ, గడగోజు నర్సింహాచారి, సలివోజు పిచ్చయ్య చారి, సంకోజు రామకోటి, కాగితాల నరసింహ చారి, తరునోజు కృష్ణమాచారి మునగంటిరాం బ్రహ్మచారి,ఆచారి ,నాగాచారి ,లోకనాథం తదితరులు పాల్గొన్నారు.