13-09-2025 02:42:23 AM
పటాన్చెరు, సెప్టెంబర్ 12 : పటాన్చెరు మండలం గీతం యూనివర్శిటీలో ఓనం వే డుకలను శుక్రవారం నిర్వహించారు. మరో కేరళను తలపించేలా సాగిన ఈ వేడుకలను గీతం స్టూడెంట్ లైఫ్ లోని అన్వేషణ విద్యార్థి విభాగం నిర్వహించింది. కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక, సంప్రదాయాలను గౌరవించడానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సమావేశమవడంతో ప్రాంగణం అంతా పం డుగ వాతావరణంతో ఉత్సాహంగా మారిం ది.
వివిధ రకాల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, ఆతిథ్య-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, వివిధ పాఠశాలల డైరెక్టర్లు, విభాగాధిపతు లు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థు లు పాల్గొనడం ఈ వేడుక స్ఫూర్తిని మరింత పెంచింది.