calender_icon.png 13 September, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద మనసు చేసుకోండి!

13-09-2025 02:43:30 AM

పెద్ద మనసు చేసుకోండి!

  1. మనసు నొప్పించి ఉంటే క్షమించండి 
  2. హమాలీలను కోరిన జిల్లా ఎస్పీ 

  3. మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): పెద్ద మనసు చేసుకోండి.. మా వాళ్ళు మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి.. అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేటలో హమాలీలకు స్వయంగా జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం హమాలీల పట్ల సీఐ దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తూ యూరి యా లారీ అన్లోడ్ చేయకుండా హమాలీలు నిరసనకు దిగారు. యూరియా పంపిణీ తీరును పరిశీలిస్తూ నరసింహుల పేట కు చేరుకున్న ఎస్పీకి ఈ విషయం తెలియడంతో హమా లీల వద్దకు వెళ్లి పెద్దమనసు చేసుకోండి, రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం తేకూడ దు, మా వాళ్ల వల్ల మీకు ఏదైనా మనస్థాపం కలిగితే అందుకు క్షమించండి అంటూ హమాలీల భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకొని కలుపుగోలుగా మాట్లాడి వారిని ఆందోళన విరమిం పజేసి లారీ నుండి యూరియా దిగుమతి చేయించారు. 

తెల్లవారిందే మొదలు.. కార్యరంగంలోకి ఎస్పీ

తెల్లారిందో లేదో.. యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ శుక్రవారం ఉదయం కార్యరంగంలోకి దిగారు. జిల్లా కేంద్రం నుండి నేరుగా కేసముద్రం చేరుకొని ధనసరి సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన యూరియా వివరాలను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడనుండి ఇనుగుర్తి, నెల్లికుదురు, దంతాలపల్లి, నరసింహుల పేట మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. అక్కడ ఎరువుల పంపిణీకి నిర్వహి స్తున్న చర్యలను పరిశీలించారు. ఎక్కడ కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైతులకు యూరియా పంపిణీ చేయడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.