calender_icon.png 20 September, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి నలుగురికి గాయాలు

20-09-2025 12:00:00 AM

తలకొండపల్లి, సెప్టెంబర్ 19: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతిచెందగా నల్గురు వ్యక్తులు గాయపడిన సంఘటన తలకొండపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. తలకొండపల్లి ఎస్త్స్ర శ్రీకాంత్ కథనం ప్రకారం వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన దుద్దుకూరి జంగయ్య (50) అను వ్యక్తి గత రెండు నెలలుగా మిడ్జిల్ మండల కేంద్రంలో సిమెంట్ ఇటుకలు తయారు చేసే పనులకు కూలీగా వెల్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం తనతోపాటు మరో నలుగురు కూలీలతో కలిసి సిమెంట్ ఇటుకలను ట్రాక్టర్లో లోడ్ చెసుకుని తలకొండపల్లి మండలం మాదాయి పల్లి గ్రామానికి బయలుదేరారు.మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీ బోల్తా పడింది.ట్రాలీలో ఇటుకలపై కూర్చున్న జంగయ్య ఇతర కూలీలు కింద పడి గాయపడ్డారు.ఈ ప్రమాదంలో జంగయ్య తలకు బలమైన గాయం అయ్యి తీవ్ర రక్త సావ్రం తో ఘటన  స్థలంలోనే మృతిచెందాడు.

మిగతా నలుగురు కూలీలకు గాయాలు కావడంతో స్థానికులు గమనించి పోలీసుల కు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలం కు చేరుకొన్న పోలీసులు బాధితుల ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి ఒకరి మృతికి కారణమైన డ్రైవర్ వారణాసి రాములు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శ్రీకాంత్ తెలిపారు.