20-09-2025 12:00:00 AM
బెజ్జూర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమీని నుంచి గేర్రగూడ వరకు దారి అంతా బురదమయంగా మారిందని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రతినిత్యం గ్రామానికి వెళ్లాలంటే వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సైతం వెళ్ళలేని పరిస్థితిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన గిరిజన గ్రామాల ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదని ప్రజలు వాపోతున్నారు.
భారీ వర్షం కురిసినట్లయితే సుస్మిర్ ఒర్రె లు ఓ పొంగితే రాకపోకలు స్తంభిస్తాయని ప్రజలు తెలుపుతున్నారు. అటవి శాఖ అనుమతులు రాక రోడ్లు,వంతెనలు మంజూరు కాకపోవడంతో గిరిజన గ్రామాల బస్సులు తదితర వాహనాలు సైతం రాక నాన్న తండాలు పడాల్సిన పరిస్థితిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్లు వంతెనలు మంజూరు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.