calender_icon.png 26 December, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువుల జోలికొస్తే ఊరుకోం

26-12-2025 12:43:22 AM

  1. అంతర్జాతీయ సమాజం స్పందించాలి
  2. శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌రెడ్డి
  3. బంగ్లాదేశ్‌లో దీపుదాస్ ఘటనపై ఆగ్రహం
  4. హైదరాబాద్ వీధుల్లో భారీ నిరసన ర్యాలీ  

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బంగ్లాదేశ్‌లో  మైనారిటీ హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడు లు, అమానుష కాండపై హైదరాబాద్ నగ రం భగ్గుమంది. పొరుగు దేశంలో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను, వరుస హత్యలను నిరసిస్తూ శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీరామ్ దళ్ రాష్ర్ట అధ్యక్షుడు వినయ్ రెడ్డి  బంగ్లాదేశ్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్‌లో దీపుదాస్ అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేయడం అత్యంత హేయమైన, అమానుష చర్య. ఇది మానవ సమాజం తలదించుకునే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడ హిందువు అని తెలిసిన వెంటనే దాడులకు తెగబడుతున్నారని, వారి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మండి పడ్డారు. హిందూ సమాజ హక్కుల పరిరక్షణ కోసం, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు ఈ ఘోరాలపై మౌనం వీడాలని కోరారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్కడి హిందువులకు రక్షణ కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే హైదరాబాద్‌లోని బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడిస్తామని వినయ్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, శ్రీరామ్ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.