calender_icon.png 6 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశ నుంచే సేవా గుణాలను అలవర్చుకోవాలి

06-08-2025 01:19:21 AM

- విద్యార్థులకు 4వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కార్పొరేటర్

ముషీరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి సేవా గుణాన్ని  అలవర్చుకోవాలని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ కుమా ర్ అన్నారు. అప్సా, భారత్ సేవాశ్రమం లాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు మంగళవారం అప్సా  సామాజిక కార్యకర్త బొట్టు రమేష్ తాను చదువుకున్న పాఠశాలకు దాతల ద్వారా అందించిన 4 వేల నోట్ పుస్తకాలను  ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి ఉన్నత శిఖరాల ను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ వసంత,  ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.