06-08-2025 01:19:23 AM
అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి
కరీంనగర్ క్రైం, ఆగస్టు 5 (విజయ క్రాంతి): సర్వసభ్య సమావేశం 1964 సహకార చట్టం ప్రకారం జరిగిందని, ఒకసారి మహాసభ కోరం లేక వాయిదా వేస్తే అదే సభను తిరిగి ఏ రోజైతే సభ ఉంటుందో అదే రోజు నిర్వహించుకునే హక్కు ఉంటుందని అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. గత పాలకవర్గం 2007 నుంచి 2017 నుంచి అవకతవకలు చేశారని ఆరోపించారు.
బ్యాంకులో కూడా తప్పుడు అడ్రస్ లు ఇచ్చి బాకు మోసం చేశారని, నోటీనులు నాకు ముట్టలేదని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ మాట్లాడారని, నోటీసులు ముట్టినట్ట ఆయనే సమాధానం చెప్పాలన్నారు. బంగారం విషయంలో కిందివారిపై చర్య తీసుకోకుండా అప్పుడున్న సీఈవోను సస్పెండ్ చేసింది నువ్వు కాదా అని అన్నారు. అదే విషయమై వారు కోర్టుకు వెళితే ఎందుకు సస్పెండ్ చేయబడేని విషయం ఆయనే పనిచేయకుండా 32 లక్షలు కట్టాల్సి వచ్చిందన్నారు.
అది మాజీ అధ్యక్షుడి నిర్వాకం కాదా అని ప్రశ్నించారు. గోల్డ్కవరీ చేయాలేదని, ఇన్స్యూరెన్స్ రికవరీ చేయలేదని ఇది గత పాలకవర్గం తప్పు కాదా అని ప్రశ్నించారు. గత పాలకవర్గ హయాంలో 15 వేల మంది సభ్యులను చేర్చారని, ఏ అకౌంట్ లేనప్పటికీ వారికి సభ్యత్వ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇంటింటి సర్వే ద్వారా 9 వేల ఓట్లు తీసివేయడం జరిగిందని, ఈ సర్వేకు 5 లక్షలు ఖర్చయిందని, ఇది నీ నిర్వాకం వల్ల కాదా అని ప్రశ్నించారు. బ్యాంకు నీ అబ్బ సొత్తు కాదని, చర్చకు సిద్ధమని విలాస్ రెడ్డిసవాల్‌విసిరారు.