06-11-2025 07:58:32 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయనందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంధు కొనసాగుతోంది. గురువారం మంచిర్యాల జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఏఓ రాజేశ్వర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మాట్లాడుతూ స్కాలర్షిప్ నిధులు రాకపోవడంతో విద్యాసంస్థలు నిర్వహించడం చాలా కష్టమవుతుందని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కి జీతాలు ఇవ్వలేక, బిల్డింగ్ అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో నిరవధిక బంద్ చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం మాకు రావలసిన గత నాలుగు సంవత్సరాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గడిపల్లి నర్సయ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్వీ రమణ, వివిడిసి కళాశాల కరస్పాండెంట్ చంద్రమోహన్ గౌడ్, ప్రిన్సిపల్ ఆర్. శ్రీనివాస్, వాగ్దేవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీకర్, మిమ్స్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీధర్ రావు, శ్రీహర్ష డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ రెడ్డి, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.