calender_icon.png 6 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

06-11-2025 07:56:40 PM

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్..

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని మహాత్మా జ్యోతిబా పూలె విగ్రహం నందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష.                         

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని కొంరం భీమ్ ఆసిఫాబాద్ బీసీ జేఏసీ చైర్మన్ రూప్ నార్ రమేష్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే  విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని  మండిపడ్డారు.

జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు రమేష్ రూపనార్ వెల్లడించారు.

డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు..కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రేగుంట కేశవ్  మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్ కుమార్, బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు పురుషోత్తం బాలేష్, గాజుల జక్కన్న,,, కాండ్రే విశాల్, పొన్న రమేష్, మాచర్ల శ్రీనివాస్, మిరాజ్ భాయ్, ని కూడా రవీందర్ అడ్వకేట్ , బీసీ జేఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పొన్నాల నారాయణ, నాగోష్య శంకర్, వైరాగడె మారుతి పటేల్, లోబడే లవ్ కుమార్, మామిడి కిరణ్, సెండె నాందేవ్, సిరికొండ సాయి కృష్ణ, డాక్టర్ రవి కాంత్, వనం మధుకర్, చేపడె సురేష్, చాటరి కారు, నికోడేనాను, రాపర్తి నవీన్, ణ. అంజి మరియు వివిధ కులాల సంఘ నాయకులు పాల్గొన్నారు.