01-12-2025 06:55:28 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
చిట్యాల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నీల వెంకటేష్ ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి, ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.