calender_icon.png 1 December, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యక్షేత్రంలో విద్యార్థుల పూజలు

01-12-2025 06:47:47 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రాష్ట్రంలోని తొలి సూర్యక్షేత్రమైన తిమ్మాపురంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని జిల్లా కేంద్రం సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ లో ఉన్న న్యూ మిలీనియం హైస్కూల్ విద్యార్థులు సోమవారం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి క్షేత్ర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్ధన్, ఘనపురం నరేష్, రామ చంద్రయ్య, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.