01-12-2025 06:53:06 PM
కొండపాక: కుకునూరు పల్లి, కొండపాక మండల గ్రామాలలోని రాజకీయ నాయకులు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులతో కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ ఏసిపి నర్సింలు, తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్, సిటీ పోలీస్ యాక్టివ్ నియమాలను ఉల్లంఘించరాదని, ముందస్తు పరిమిషన్ లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.
ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు ఇబ్బందులకు గురికాకుండా ప్రచారం చేసుకోవాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ఎన్నికలను జరుపుకోవాలని పంచాయతీరాజ్ చట్టంలోని చేయవలసిన పనులు, చెయ్యకూడని పనుల గురించి సూచించడమైనదని, ప్రతి గ్రామంలోని బెల్డు షాపులు నిర్వహించే వారి సమాచారం ఇవ్వవలసిందిగా సూచించామని తెలిపారు.