01-12-2025 06:50:02 PM
మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమవుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అర్వపల్లిలో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అడ్డంకులను అధిగమిద్దాం-ఎయిడ్స్ ప్రతిస్పందనని మారుద్దాం.. అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా నివారణ మందులు వాడాలని, ఆసుపత్రిలో వాటిని ఉచితంగా అందజేస్తారని అన్నారు.
ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని అన్నారు. సురక్షితం కానీ లైంగిక సంపర్కం వల్ల, సురక్షితం కానీ రక్తమార్పిడి వల్ల ఎయిడ్స్ వ్యాధి సంభవిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునిత, మాధవి, చొక్కయ్య, శ్రీనివాస్, అనూష, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.