calender_icon.png 16 October, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలసికట్టుగా ఉద్యమిస్తేనే!

16-10-2025 12:26:23 AM

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ మా దిరిగా బీసీల రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ ఏర్పాటు కావడం శుభపరిణామం. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో పెట్టి కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ కేంద్రం పట్టించుకోక, గవర్నర్ ఆర్డినెన్స్‌పై ఆమోదం తెలుపక, పంచాయతీ రాజ్ చ ట్టం సవరించి ఫలితం లేక నిరాశ నిస్పృహలో కాంగ్రెస్ చివరి ప్రయత్నంగా ప్రత్యే క జీవో నెం 9 తెచ్చింది. ఇంతలోనే రిజర్వేషన్ల వ్యతిరేకులు కోర్టు మెట్లు ఎక్కి నో టికాడి బువ్వను స్టే రూపంలో లాగేసుకున్నారు.

దీనిపై భగ్గుమన్న బీసీ సంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ , తీన్మార్ మల్లన్న, చిరంజీవి ఎ వరికీ వారు యమునా తీరే అన్న మాదిరిగా హైదరాబాద్ కేంద్రంగా ఒకరు రాష్ర్ట బంద్ అంటూ, ఒకరు నిరసనలు అంటూ, ఒకరు రాస్తారోకో అంటూ బీసీ సమాజాదన్ని గందరగోళంలో పడేశారు. అయితే బీసీలు ఐక్యంగా లేనంత కాలం ఏ బంద్ విజయవంతం కాదనేది జగమెరిగిన స త్యం.

అందుకే జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యం లో అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఐక్యతతో ముందుకెళ్లాలని తీర్మానం చేయడం, మరుసటి రోజు రాష్ర్టంలో బ లంగా ఉన్న సంఘాలు ఏకతాటి పైకి వచ్చి ఐక్య కార్యాచరణకు శ్రీకారం చుట్టడం వల్ల అన్ని పార్టీలకు వణుకు పుట్టింది. ఉసిరికాయ మూట అనుకున్న బీసీలు భేషజా లకు పోకుండా, పదవులు ఆశించకుండా కలసికట్టుగా ముందుకు రావడంతో ఇవా ళ తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటైంది.

రిజర్వేషన్ల ఉద్యమం ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లి, రిజర్వేషన్లు సాధనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం ముమ్మరం చేయాలి. ఇప్పటికే బీసీ ఉద్యమాన్ని ఢీల్లీలో వినిపించేందుకు ప్రత్యేక రైలులో వెళ్లిన బీసీ వాదులు జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాతో కేంద్రం దిగి వచ్చి కులగణనకు సై అన్న విషయం మరచిపోవద్దు.  

బీసీలకు నయవంచన

రెడ్డి జాగృతి పేరుతో బీసీలను నయవంచనకు గురిచేస్తున్నా, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల కుల బలం ఎంత? ఎందుకు అడ్డుకుంటున్నారు? దీని వెనుక ఎవరున్నారనేది తేల్చాల్సిన బాధ్యత రాష్ర్ట ప్ర భుత్వానికి ఉన్నది. హైకోర్టు జీవో ‘9’పై స్టే ఇస్తే సుప్రీం కోర్టులో స్టే వెకేట్ చేస్తారని దుర్మార్గంగా కేవియట్ వేసి వారి అక్కసు ను వెళ్లగక్కారు. నాడు ఆంధ్రపాలకులు అ వలంభించిన ధోరణి వల్లనే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష పెరిగింది.

జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు తెలంగాణ ఉద్యమం లో రోడ్డు మీదకు రావడం వల్లనే తెలంగా ణ ఉద్యమం ఊపందుకుంది. ఇప్పుడు కూడా 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, 136 కుల సంఘాలు, బీసీ సంఘా లు కలిసికట్టుగా ఉండేందుకు ఒక జేఏసీ రాజకీయ వేదికలో పాల్గోని బీసీ ఉద్యమానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంది.

ఇక కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టేందుకు రాజకీయా లకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజే పీ, టిజేఎస్ టీడీపీ, న్యూ డెమోక్రసీ, సీపీ ఐ, సీపీఎం, టీఆర్పీ పార్టీలు, మేధావుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సం ఘాలు ముందుకొచ్చి రిజర్వేషన్ల ఎజెండాతో చేతులు కలిపి భాగస్వాములు కా వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తె చ్చేందుకు రిజర్వేషన్లు సాధించే వరకు రా ష్ర్ట బంద్‌తో పాటు, సకలజనుల సమ్మె, సాగరహారం, వంటా వార్పు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాలి. గాంధేయ వా దంతో బీసీలు ప్రజాక్షేత్రంలోకి రావల్సిన అవసరముంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ ల నుంచి అనుకూలత వచ్చేలా కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా కూడగట్టాలి. 

ఈడబ్ల్యూఎస్‌కు బీజం

బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు జేఏసీ ఈ నెల 18న రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ర్ట బంద్ అంటే ఆకలి బం ద్, దూప బంద్, బడి బంద్, రవాణా బం ద్ చేయడమే గాక రెండున్నర కోట్ల బీసీ బి డ్డల గొంతుకలు ఒక్కటైతే అన్ని రంగాల్లో స్తబ్దత చోటుచేసుకుని ప్రజాజీవనం స్థంభిస్తుంది. ఇవాళ తెలంగాణ బీసీ బిడ్డలు పౌ రుషం చూపెడితేనే కేంద్ర, రాష్ర్ట ప్ర భుత్వా ల్లో మార్పు వచ్చే అవకాశముంది.

అలాగని హింసాత్మకంగా మారితే నష్టపోయేది కూడా బీసీలే. దీనికి ఉదాహరణ రాజస్థాన్‌లో జరిగిన సంఘటన. 2003 ఎన్ని కలకు ముందు గుజ్జర్లను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి బీజేపీ ఎన్నికల్లో గెలిచింది. కానీ సంఖ్యాపరంగా బలంగా ఉన్నా మీనా కమ్యూనిటీ నుంచి వచ్చిన హింసాత్మక వ్యతిరేకత రా ష్ర్ట ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టింది.

అదే మా దిరిగా వాజ్‌పేయి ప్రభుత్వం జాట్‌లను ‘ఇతర వెనుకబడిన తరగతి’గా తిరిగి వర్గీకరిం చాలని నిర్ణయించిన తర్వాత మాత్రమే సమాజంలో కోపం, రాజకీయ ఏకీకరణ ఆందోళనకరమైన పరిమాణాలు సంతరించుకున్నాయి. ఇక ప్రధాని మోదీ రాష్ర్టం గుజరాత్‌లోని పటీదార్ కమ్యూనిటీ దేశ వ్యాప్తంగా ఓబీసీ హోదా కోరుతూ ఆగస్టు 25, 2015న అహ్మదాబాద్‌లో వేలాది మందితో అతిపెద్ద ప్రదర్శన నిర్వహించిం ది.

రాష్ర్టవ్యాప్తంగా హింస, దమన కాం డలు జరిగాయి. గొడవలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వం ఇం టర్నెట్‌ను నిషేధించాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని కోర్టు సమర్థించడంతో గుజరాత్‌లోని అనేక నగరాలు, పట్టణాలలో కర్ఫ్యూ వి ధించారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమై మళ్లీ హింసాత్మకంగా మారింది.

దీని తో ప్రభుత్వం జనరల్ కేటగిరీ విద్యార్థుల కు స్కాలర్‌షిప్‌లు, వివిధ సబ్సిడీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం సీట్లను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 10శాతం రిజర్వేషన్‌ను ఆగ స్టు 2016లో గుజరాత్ హైకోర్టు రద్దు చే సింది, మండల్ కమిషన్ నుంచి నేటి వర కు వారి కుట్రలు ఆగలేదు. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మూలంగా మా రింది. 

ఐకమత్యంతోనే సాధ్యం

భారత పార్లమెంటు సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ జనవరి 2019లో రాజ్యాంగాన్ని సవరించింది. ఈ సవరణను సుప్రీంకోర్టులో సవాలు చేసి భంగపడ్డారు. అయితే ఇం ద్రా సహానీ కేసు, కృష్ణమూర్తి కేసులోని 50 శాతం పరిమితి అప్పట్లో న్యాయమూర్తులకు గుర్తు రాలేదు. గుజరాత్ రాష్ట్రం నుంచే బీసీలకు అన్యాయం మొదలవ్వడం జరిగింది.

అందుకే ఇవాళ సంపన్నులను అతి సంపన్నులను చేయడానికి ఈడబ్ల్యూఎస్ నిరాడంబరంగా అమలవుతుంది. బీ సీ వర్గానికి చెందిన అనేక సంఘాలు, వి ద్యార్థి, ఉద్యోగ, యువత, మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి కల సికట్టుగా ఉద్యమించాల్సిన అవసరముం ది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా బీసీ ఉద్యమం సాగితే తప్ప తొమ్మిదొవ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్ధతకు కేంద్రం ఆమోదం తెలిపేలా కనిపించడం లేదు.

నా డు సకలజనుల సమ్మె తెలంగాణ జేఏసీ చరిత్రలో లిఖించదగ్గ ఉద్యమం. అటువంటి ఉద్యమం బీసీ జేఏసీ చేపట్టినప్పుడే ‘మేమెంతో మాకంతా’ అన్న నినాదం సాకారం కావడానికి ప్రభుత్వాలు దిగివస్తాయి. న్యాయమైన డిమాండ్ రాజ్యాం గంలో ఎక్కడా పరిమితి విధించని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు కోసం కార్యాచరణ మొదలైంది. రాష్ర్ట ప్రభుత్వం పం పిన బిల్లులు ఆమోదం పొందాలంటే కేం ద్ర ప్రభుత్వం న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు పాల్గొని బీసీలకు అండగా నిలవా లి.

౪2 శాతం బిల్లు ఉభయసభల్లో ఆ మో దం పొందడానికి ఆన్ని పార్టీలు స హకరించామని చేతులు దులుపుకుంటే సరిపోదు. బీసీ జేఏసీ ఉద్యమంలో భాగస్వామ్యం అయినప్పుడే పార్టీలకు మనుగ డ ఉం టుంది. అందుకే చరిత్ర హీనులుగా మిగలకుండా స్థానిక సంస్థల్లో అసాధ్యమన్న రి జర్వేషన్లు సుసాధ్యం చేయడానికి సిద్ధమవ్వాలి.

 వ్యాసకర్త సెల్: -9866255355