16-10-2025 12:24:24 AM
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రవాద సంస్థగా ముద్రపడిన తెహ్రీక్ పాకిస్థాన్ (టీటీపీ)కి అఫ్గానిస్థాన్ ఆశ్రయం ఇస్తుందనే కారణంతో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి కాల్పులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహ్సూద్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ అక్టోబర్ 9న అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో వైమానిక దాడులకు పాల్పడింది.
పాక్ దాడులకు ప్రతీ కారంగా తాలిబన్ కూడా ఎదురుదాడికి దిగింది. పాక్‌కు చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, తమ దాడిలో 58 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారని, మరో 30 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. మరోవై పు తమ దళాలు 15 నుంచి 20 మంది అఫ్గాన్ తాలిబన్లను హతమార్చా మని పాక్ సైన్యం వెల్లడించింది. బుధవారం మరోమారు ఘర్షణలు చెలరేగిన వేళ ఇరు దేశాలు రెండు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీక రించడం గమనార్హం.
ప్రస్తుతం పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ మళ్లీ అలజడి చెలరేగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా పాక్, అఫ్గాన్ మధ్య ఘర్షణకు మూడు కారణాలున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థగా పేర్కొన్న తెహ్రీక్ పాకిస్థాన్ (టీటీపీ)కి అఫ్గానిస్థాన్ ఆశ్రయం ఇవ్వడం మొదటి కారణం. తాలిబన్ల అండతో అఫ్గానిస్థాన్ కేంద్రంగా టీ టీపీ తమ దేశంపై దాడులకు తెగబడుతుందని పాక్ ఆరోపిస్తుంది. తాలిబన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ అఫ్గాన్ తాలిబన్లు మాత్రం వారి మాటలను పెడచెవిన పె ట్టారు.
దీంతో ఆగ్రహం చెందిన పాక్ సైన్యం టీటీపీ టార్గెట్‌గా అఫ్గాన్‌పై వైమానిక దాడులకు తెగబడింది. ఇక రెండో అంశమేంటంటే.. తమ దే శంలో ఉన్న లక్షల మంది అఫ్గానిస్తానీయులను పాకిస్థాన్ బలవంతంగా పంపిస్తుంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్ ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంది. తాలిబన్ల దగ్గర డబ్బులు లేకపోవడం, లక్షల మందిని తిరిగి అఫ్గాన్‌కు పం పిస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ అంశం తాలిబన్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ అయిన డ్యూ రాండ్ లైన్ వివాదం మూడో అంశంగా ఉంది.
డ్యూరాండ్ లైన్ వి వాదం ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ తాజాగా టీటీపీ ఉగ్రవాదులు డ్యూ రాండ్ లైన్ సరిహద్దు నుంచే పాక్‌లోకి అక్రమంగా చొరబడి తమ వాళ్లను టార్గెట్ చేస్తున్నారని పాకిస్థాన్ వాదిస్తుంది. సుమారు 2,640 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్న డ్యూరాండ్ రేఖ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దు లో ఉన్న పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది. అప్పటినుంచి డ్యూరాండ్ రేఖ వివాదాస్పదంగా మారింది.
బలూచిస్థాన్‌తో పాటు ప ష్టూన్ భూభాగాలను తిరిగి ఇవ్వాలని అఫ్గాన్ కో రుతూ వస్తుంది. అయితే 2017లో సరిహద్దు వద్ద పాకిస్థాన్ కంచె నిర్మించడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఇటీవలే అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటించిన సంగతి తె లిసిందే. భారత్‌తో సన్నిహితంగా ఉండడం పాక్‌కు నచ్చలేదు. పాక్, అఫ్గాన్ మధ్య యుద్ధం ము దిరినప్పటికీ ఇరు దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యుద్ధం ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు!