09-05-2025 01:35:05 AM
మహబూబాబాద్, మే 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద వేసవికాలంలో ప్రజలకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం మహబూబా బాద్ రూరల్ సిఐ సర్వయ్య చలివేంద్రాన్ని ప్రారంభించారు.
చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు, బాటసారి లకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడు తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీ ఎస్త్స్ర రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.