09-05-2025 01:36:03 AM
తిమ్మాపూర్, మే 8, (విజయ క్రాంతి): మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ లో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధి, సిహెచ్ జనార్దన్ రావు, మండల విద్యాధికారి మధు సూదనాచారి, స్కూల్ ప్రిన్సిపాల్ స్వప్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బండి మల్లేశం, ఎన్.బాబురావు, మాతంగి సహదేవ్, లతో పాటు పలువురు పాల్గొన్నారు.