05-05-2025 10:04:18 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య...
హనుమకొండ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య(District Collector Praveenya) అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులను వినతులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీలను పెండింగ్ లో లేకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 143 వినతులను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.